వామ్మో.. జిలేబీ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు.. నడిపిందీ మహిళే..

అప్పుడప్పుడు విచిత్ర, వింత ఘటనలు జరుగుతుంటాయి. రోడ్డుపై ఉన్న షాపు/ టీ స్టాల్‌లోకి వాహనాలు వెళుతుంటాయి. ఆ ప్రమాదాల్లో కొందరు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మంగళవారం విచిత్ర ఘటన ఒకటి జరిగింది. ఓ కారు ఏకంగా జిలేబి సెంటర్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఆ కారు నడిపింది కూడా ఓ మహిళ కావడం విశేషం. ఆమె సమీపంలోని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

హైదరాబాద్ శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇదీ విచిత్ర ప్రమాదం. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గల జిలేబీ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో షాపులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేడి నూనె మీద పడడంతో వారు గాయపడ్డారు. కారు ఎవరూ నడిపారని చూశారు. అయితే అందుల్లోంచి మహిళ బయటకు వచ్చారు. దీంతో అక్కడున్న వారు విస్తుపోయారు. మహిళ డ్రైవ్ చేశారా అని ముక్కున వేలేసుకున్నారు.

car crashed into jilebi shop in shamshabad area. police seized a car.

అప్పటి వరకు అక్కడ ప్రశాంతంగా ఉండగా.. ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దుకాణం వైపు కారు దూసుకొస్తుండటాన్ని గమనించిన వారు పక్కకు పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవింగ్ చేసిన మహిళ చెప్పడంతో తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆమె లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+