దారుణం.. ఇంటికి పిలిచి.. స్టూడెంట్‌పై వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు...

హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ కాలేజీ విద్యార్థినిని విందు పేరిట తన ఇంటికి పిలిచిన వైస్ ప్రిన్సిపాల్‌ ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని బయటపడ్డ యువతి ఈ నెల 9వ తేదీ రాత్రి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని అల్వాల్‌కి చెందిన ఓ యువతి రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాకు చెందిన కల్యాణ్ వర్మ ఇదే కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 29వ తేదీ సాయంత్రం విందు పేరుతో కల్యాణ్ వర్మ ఆ యువతిని తన ఇంటికి పిలిచాడు. దీంతో సోదరుడిని వెంటపెట్టుకుని ఆ యువతి అక్కడికి వెళ్లింది.

case filed against a college vice principal for sexual harassment on a girl

సోదరుడిని ఇంటి బయటే ఉండమని చెప్పి ఆమె మాత్రమే లోపలికి వెళ్లింది. ఆ సమయంలో కల్యాణ్ వర్మతో పాటు రవీందర్ అనే మరో లెక్చరర్ రవీందర్ కూడా అక్కడే ఉన్నాడు. కొద్దిసేపు యువతితో ముచ్చటించిన ఆ ఇద్దరు.. ఆపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న యువతి ఈ నెల 9న రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+