చిక్కుల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్- కేసు నమోదు..!!

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఇవ్వాళ దేశ రాజధానిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ నేపథ్యంలో- తెలంగాణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు.. కవితను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆందోళనలు చేపట్టారు.

అదే సమయంలో కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా దుమారం చెలరేగింది. మద్యం కుంభకోణానికి పాల్పడిన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

Case filed against Telangana BJP Chief Bandi Sanjay in Banjara Hills Police Station at Hyderabad

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం ఖాయమని, తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదనీ హెచ్చరించారు బండి సంజయ్. చట్టసభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలో కవిత దీక్ష చేయడంలో అర్థం లేదని, కేసీఆర్ పాలనలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాల మీద ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయం వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈడీ ఆఫీస్ గేటుకు తాళం వేశారు. అక్కడే బైఠాయించారు. బీజేపీ, ప్రధాని మోదీ, బండి సంజయ్ కు నిరసనగా నినాదాలు చేశారు.

అక్కడితో ఆగలేదు బీఆర్ఎస్ నాయకులు. ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కల్వకుంట్ల కవితను కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యానాలు చేశారని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిఖితపూరకంగా బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. బండి సంజయ్ పై ఐపీసీ 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+