హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్: నీరా కేఫ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..

|
Google Oneindia TeluguNews

నీరా.. స్వచ్చమైన పానీయం. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరూ తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకోసమే నీరా కేఫ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గుచూపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నీరా కేఫ్.. ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్టే అవుతుంది. ఇప్పటికే నీరా కేఫ్ కోసం నెక్లెస్ రోడ్డులో ఏర్పాట్లు పూర్తి చేశారు.

స‌హ‌జ‌సిద్ధ‌మైన నీరా, నీరా ఉత్ప‌త్తులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్ర‌భుత్వానికి సోమ‌వారం కీల‌క ఆమోదం ల‌భించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి లైసెన్స్ ల‌భించింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమ‌వారం మీడియాకు వివరించారు. ఈ లైసెన్స్ తెలంగాణ చ‌రిత్ర‌లోనే ఓ సువర్ణాధ్యాయంగా అభివ‌ర్ణించారు.

central government agree to neera cafe establish

స‌హ‌జ‌సిద్ధంగా చెట్ల నుంచి వ‌స్తున్న నీరాను గ‌త ప్రభుత్వాలు నిర్ల‌క్ష్యం చేశాయ‌ని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నీరా మ‌త్తు ప‌దార్థం కాద‌ని, ఔష‌ధ గుణాలు ఉన్న స‌హ‌జ‌సిద్ధ ద్రావ‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీనిని ప్రోత్స‌హించేందుకు నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నీరాతోపాటు నీరా ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

నీరా తాగితే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. అందుకే చాలా మంది నీరాను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయుర్వేదం, ఇతర మందుల్లో కూడా నీరా ఉపయోగిస్తారు. అందుకే నీరాకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది నీరాను తీసుకుంటారు. గ్రామాల్లో నీరా లభిస్తోంది. దానిని పట్టణ/ సిటీ వాసులకు అందించాలని ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేస్తోంది.

English summary
central government agree to neera cafe establish minister srinivas goud said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X