'మెట్రో' రాజకీయం: కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1,250 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు భారత రాష్ట్ర సమితికి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిపై ఎన్ని లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిచారు. కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 12 అంశాలపై లేఖాస్త్రాలు సంధించారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు సహకరించాలని కోరారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలన్నారు. సైనిక స్కూల్, సైన్స్ సిటీ కోసం భూమి కేటాయించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రైల్వేల పురోగతికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1,250 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో డీపీఆర్ మంజూరైందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ మధ్య ఒప్పందం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుంటోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో వాస్తవానికి పలక్ నుమా వరకు రావాలని, కానీ అఫ్జల్ గంజ్ వద్దే ఆపారని, పాతబస్తీకి మెట్రో రాకుండా అన్యాయం చేశారన్నారు. భారతీయ జనతాపార్టీని రాజకీయాల కోసం విమర్శించమనే చెబుతున్నామని, కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావడానికి సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ అబద్దాలకు మారుపేరని, మసిపూసి మారేడుకాయ చేస్తారని విమర్శించారు.

దళిత విద్యార్థుల జాబితాను పంపించమంటే కాలయాపన చేస్తోందని, ఈ సంవత్సరం వారికి రావల్సిన ఉపకార వేతనాలను అందకుండా చేస్తోందన్నారు. తెలంగాణకు ఇదే ప్రభుత్వం కొనసాగితే నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని మండిపడ్డారు. లేఖలు రాస్తే రిప్లై ఇచ్చే సంస్కారం కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ఇక్కడ గొంతు చించుకుంటే ఉపయోగం ఉండదన్నారు.












Click it and Unblock the Notifications