చోట.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు అరెస్టు ఆ నటిని మోసం చేశారనే ఫిర్యాదు..!

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట.కె. నాయుడు సోదరుడు శ్యామ్.కె.నాయుడు పై ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్యామ్.కె. నాయుడు పై నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. శ్యామ్.కె. నాయుడు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇవే కాకుండా చాలా సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీ అందించాడు.

Recommended Video

    Shyam.k.Naidu Is Taken Into Custody By S.R.Nagar Police
     క్యారెక్టర్ ఆర్టిస్టును మోసం చేసిన శ్యామ్‌.కె.నాయుడు

    క్యారెక్టర్ ఆర్టిస్టును మోసం చేసిన శ్యామ్‌.కె.నాయుడు

    పోకిరి, బిజినెస్‌మ్యాన్, జులాయి, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించాడు శ్యామ్‌.కె. నాయుడు. ఇదిలా ఉంటే శ్యామ్‌పై ఫిర్యాదు చేసిన సాయి సుధా క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆమె అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో నటించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని శ్యామ్‌.కె.నాయుడు మోసం చేశారని పేర్కొంటూ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్యామ్‌. కె. నాయుడును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    ఐదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం: సాయిసుధ

    ఐదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం: సాయిసుధ


    తాను సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సాయి సుధాతో పరిచయం ఏర్పడిందని సమాచారం . ఇదిలా ఉంటే గత ఐదేళ్లుగా శ్యామ్.కె. నాయుడుతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సాయి సుధ చెప్పారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా తను గట్టిగా అడుగగా తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సాయి సుధ చెప్పింది. ఇక ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఫోటోలు, కాల్ రికార్డింగులు అన్నీ తన వద్ద ఉన్నాయని వెల్లడించింది. ఇక తనతో పరిచయమయ్యాక తన కుటుంబంలో భార్యతో జరిగిన గొడవలను తన వద్ద ప్రస్తావించేవారని చెప్పింది సాయి సుధ.

    చోట కె. నాయుడుకు కూడా తెలుసు


    ఈ విషయం చోట.కె. నాయుడుకు కూడా తెలుసని తను కూడా మాట్లాడినట్లు సాయి సుధ చెప్పింది. కుటుంబంలో కొన్ని డిస్ట్రబెన్స్‌లు ఉన్నాయని వాటిని పరిష్కరించుకుని త్వరలో తన దగ్గరకు వస్తాడని చోట కె. నాయుడు తనతో చెప్పినట్లు సుధా వివరించింది. అన్నీ చేస్తామని అంతా మాట్లాడతామని చెప్పిన వారు అడ్రస్ లేకుండా ఎస్కేప్ అయ్యారని సుధా పేర్కొంది. కేసు పెట్టుకో ఏది జరిగితే అదే జరుగుతుందని వారు చెప్పారని సుధా తెలిపింది. ఇంత ముందుకు ఎప్పుడూ కేసు పెట్టలేదని చెప్పిన ఆమె... హీరో సందీప్ కిషన్ తల్లి మాట్లాడటంతో కేసు పెట్టకుండా ఉపసంహరించుకున్నట్లు చెప్పింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+