Hyderabad Leopard: హైదరాబాద్‍లో చిరుత సంచారం.. ఆందోళనలో ప్రజలు..!
చిరుత పులులు అంటే ఎక్కడో అడవిలో ఉంటాయని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ చిరుత పులులు పట్నంలో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం అర్ధరాత్రి వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నంబర్ 6లో చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంటి ఆవరణలో రాత్రి 12 గంటల 30 నిమిషాలకు చిరుత సంచరించినట్లు యజమాని అఖిల్ చెప్పాడు.
వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి బయల్దేరారు. కానీ పోలీసులు వచ్చేలోపే చిరుత ఎరోనాటికల్ సంస్థ గోడ దూకి అడవిలోకి పారిపోయినట్లు అఖిల్ వివరించాడు. ఆ వెంటనే అక్కడి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. చిరుత అడుగులను పరిశీలించారు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. చిరుత సాధారణంగా 24 గంటల్లో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఈ లెక్కన చిరుత ఇబ్రహీంపట్నం అడవిలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత పులి కదలికలను గుర్తించేందుకు పలు చోట్ల కెమెరాలు కూడా అమర్చారు. అటవీ శాఖ అధికారులు బోన్లు కూడా సిద్ధం చేశారు. చిరుత కదలికలను బట్టి బోన్లు ఏర్పాటు చేయనున్నారు.చిరుత సంచారంతో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఏ వైపు నుంచి వస్తుందోనని భయపడిపోతున్నారు.
మొన్నటి వరుక తిరుమలలో కూడా చిరుతలు భక్తులను భయపెట్టాయి. ఓ చిరుత రక్షిత అనే బాలిక పై దాడి చేసి చంపాయి. దీంతో టీటీడీ అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు పలు చోట్లు బోన్లు ఏర్పాటు చేసి రెండు చిరుతలను బంధించారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ లో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ శాఖ అధికారులు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు.
-
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications