రాజాసింగ్‌తో చికోటి ప్రవీణ్ భేటీ, బీజేపీలో చేరను, కేటీఆర్‌పై పోటీ చేయ,

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌తో భేటీ అయ్యారు. రాజా సింగ్‌ను కలిసి, మంచి, చెడు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కోఠి ఇసామియా బజార్‌లో గల సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు చేశారు. అక్కడి నుంచి రాజాసింగ్ ఇంటికి వెళ్లారు.

హిందూ ధర్మాన్ని పరిరక్షించటం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి రాజా సింగ్ అని ప్రవీణ్ తెలిపారు. తను కూడా హిందుత్వవాదినేనని తెలిపారు. ఓ హిందూత్వవాదిగా రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానని తెలిపారు. ఆయనకు తనకు మద్దతు ఉంటుందని, హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని ప్రకటించారు.

 chikoti praveen meets mla raja singh

బలవంతంగా మత మార్పిడి చేసే వారి తోలు తీస్తానని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరికీ భయపడనని తెలిపారు. ఇటీవల తనపై ఈడీ దాడులు జరిగినా, భయపడలేదని తెలిపారు. అలాగే తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేటీఆర్ మీద పోటీ చేస్తాననేది పుకార్లు మాత్రమేనని వివరించారు. తనకు ఏ పార్టీలోనే చేరే ఆలోచన లేదని తెలిపారు.

ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చికోటీ ప్రవీణ్‌ను కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కథను ఆర్జీవీ సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. తాము మాట్లాడిన సమయంలో ఆర్జీవీ తెలిపారని వివరించారు. వర్మ పిలిచి తనకు సినిమాల్లో ఆఫర్ ఇస్తే నటిస్తానని.. సినిమాకు నిర్మాతగా మాత్రం వ్యవహరించనని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+