childrens day: పిల్లలకు ఈరోజు ఉచిత ప్రయాణమంటూ టీఎస్ఆర్టీసీ ప్రకటన

హైదరాబాద్: బాలల దినోత్సవం(చిల్డ్రెన్స్ డే) పురస్కరించుకుని చిన్నారులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం రోజున 15 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

ఆదివారంనాడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన ఏసీ, డీలక్స్, ఆర్డినటరీ ఇలా ఏ బస్సులోనైనా చిన్నారులకు టికెట్ అవసరం లేదని సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

childrens day 2021: TSRTC special offer for children, that is free travel today.

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను లాభాల బాటలోకి తెచ్చేందుకు సజ్జనార్ అనేక ప్రణాళికలు, పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇటీవలో ర్యాపిడో సంస్థ ఆర్టీసీని కించపర్చేలా వ్యవహరించిందని లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేగాక, ర్యాపిడో యాడ్ నటించిన సినీ హీరో అల్లు అర్జున్ పైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ర్యాపిడో సంస్థ తన యాడ్‌లో ఆర్టీసీ బస్సును తొలగించి ప్రసారం చేస్తోంది.

అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. ర్యాపిడో యాడ్‌ వివాదంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామఅన్నారు. యాడ్‍లో నటించిన అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్నారు.

ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తమ నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామన్నారు. తక్షణమే అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసీ‌కి క్షమాపణలు చెప్పాలని వెల్లడించారు. వెంటనే ఆ యాడ్ నిలిపివేయాలన్నారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్‌లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని చురకులు అంటించారు సజ్జనార్. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని హితవు పలికారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని, తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని వెల్లడించారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందని సజ్జనార్ తెలిపారు.

'రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుని లగ్జరీ కార్లలో తిరుగుతారు.. ఆర్టీసీ బస్సుల్లో తిరిగే సామాన్యులంటే చిన్నచూపా' అంటూ సెలబ్రిటీలపై సీరియస్ అయ్యారు సజ్జనార్. ఆర్టీసీ ప్రయాణాన్ని కించపరుస్తూ తీసిన యాడ్‌పై అల్లు అర్జున్, ర్యాపిడో ఏజెన్సీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాపిడో యాడ్‌లో చూపిన బస్సు తెలంగాణ బస్సేనని అన్నారు. హెచ్‌సీయూ బస్ డిపో నుంచి ఒక రోజు కోసం రెంట్ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేశారని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఎక్కితే దోశలా అవుతారంటూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామంటూ సజ్జనార్ హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

మంగళవారమే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే. టీవీ ఛానల్ ప్రకటనల్లో, యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ఆ ప్రకటనలో చెప్పడం కనిపిస్తుంది.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారంతా ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+