Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచలనం..!!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జంటనగరాల్లో షేర్ ఆటో సర్వీసులను నిషేధించారు.

హైదరాబాద్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపట్ల కొంత వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ- సాధారణ ప్రయాణికులు దీన్ని స్వాగతిస్తోన్నారు.

జంటనగరాల్లో షేర్ ఆటోల్లో ప్రయాణాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా నిషేధించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లల్లో సర్వసాధారణంగా కనిపించే ఆటో సర్వీసులు ఇవి. అద్దె ప్రాతిపదికన కాకుండా- ఒక్కో ప్రయాణికుడి నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని వారిని గమ్యస్థానాలకు చేర్చే షేర్ ఆటోలు ఓవర్ లోడ్ తో తిరుగాడుతుంటాయి.

 City traffic police made a key decision to ban share autos in Hyderabad and Secunderabad

దీనివల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తోన్నాయనే కారణంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. షేర్ ఆటో సర్వీసులను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్టవుతుందని వారు భావిస్తోన్నారు. ప్రస్తుతం జంటనగరాల్లో విస్తృతంగా సిటీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులో ఉంటోన్నాయి.

 City traffic police made a key decision to ban share autos in Hyderabad and Secunderabad

షేర్ ఆటోల్లో ప్రయాణాన్ని నిషేధించడం ద్వారా సిటీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ రవాణా వ్యవస్థలకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తోన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించినట్టవుతుందని భావిస్తోన్నారు. ఈ నిర్ణయాన్ని వెల్లడించడానికి ట్రాఫిక్ పోలీసులు- సిటీ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జీ సుధీర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ ఆటో ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని సూచించారు. స్టాప్ లైన్‌ను పాటించాల్సి ఉంటుందని, ట్రాఫిక్ జంక్షన్లల్లో ఫ్రీ లెఫ్ట్ అడ్డంకులను సృష్టించకూడదని అన్నారు.

 City traffic police made a key decision to ban share autos in Hyderabad and Secunderabad

బస్ బేల్లో వెళ్లకూడదని, రోడ్డు మధ్యలో ఆటోలను ఆపకూడదని సుధీర్ బాబు ఆదేశించారు. యూనిఫాం ధరించడాన్ని తప్పనిసరి చేశామని, దీన్ని పాటించాల్సిందేనని అన్నారు. ప్రయాణికుల నుంచి మీటర్ పై అదనంగా ఛార్జీలను డిమాండ్ చేయకూడదని అన్నారు. సామర్థ్యానికి మించి అదనపు ప్రయాణీకులను తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+