శభాష్ కోనప్ప.. సేవా కార్యక్రమాలు సూపర్, సీఎం కేసీఆర్ ప్రశంసలు

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన చేస్తున్న మంచి పనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ను కోనప్ప కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. కోనప్పను ప్రశంసలతో ముంచెత్తారు. కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కోనప్పు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజక వర్గంలో కోనప్ప పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోనప్ప కుటుంబ సభ్యులు బుధవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలుసుకున్నారు. నియోజక వర్గంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి రోజూ 1000 మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతామని.. ఇదీ రోజు కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి మంచి పనిని అభినందనీయమని కేసీఆర్ అన్నారు.

cm kcr appreciates mla koneru konappa

అలాగే స్కూళ్లకు టీవీలు అందజేస్తారు. ఇప్పుడు కరోనా వల్ల స్కూళ్లు ఓపెన్ లేవు.. కానీ ఇదివరకు తెరచిన సమయంలో వారికి అవసరాలు తీర్చేవారు. టీవీలను అందజేసేశారు. టీచర్‌- పోలీసు- మిలిటరీ ఫారెస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్నభోజనం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్పూర్తిగా నిలిచారు.

ఇన్నీ మంచి పనులు చేస్తున్న కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయం అన్నారు. కోనప్పను సీఎం కొనియాడగా.. తనపై వాత్సల్యం చూపిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+