Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతబస్తీకి గుడ్‌న్యూస్: ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోపై కేసీఆర్ ఆదేశాలు: కేటీఆర్, ఒవైసీ స్పందన

హైదరాబాద్: పాతబస్తీ ప్రజలకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. పాతబస్తీ మెట్రో త్వరలోనే పట్టాలెక్కనుంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గం కోసం 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మున్సిపల్ శాఖ, ఎల్అండ్‌టీ సంస్థకు స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మెట్రో రైలు తొలి విడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతోపాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తర్ణం 74.7 కిలోమీటర్లకు విస్తరించనుంది.

CM KCR directs acceleration of Old City Metro project: KTR, Asaduddin owaisi responded

దాదాపు ఆరేళ్లుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్మెంట్) సర్వే నిర్వహించినా ముందడుడు పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్.. పాతబస్తీ మెట్రో ముండుగుపై ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మున్సిపల్ అధికారులతో, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియణ్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో పాతబస్తీ ప్రజలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.

మరోవైపు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. కేటీఆర్ ప్రకటనను స్వాగతించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రజలు ప్రజా రవాణా కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ ప్రజలకు సహాయం చేస్తుంది, మరింత పర్యాటకాన్ని కూడా తీసుకువస్తుందని అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు. .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+