దీపావళిమరికొన్ని గంటల్లో దీపావళి పర్వదినం. దివాళి అంటేనే: ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. గ్రీన్ క్రాకర్స్

మరికొన్ని గంటల్లో దీపావళి పర్వదినం. దివాళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయం. పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను పంచే పండుగగా దీపావళిని దేశ ప్రజలు జరుపుకుంటారని ఆయన అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు.

 అవీ వద్దు..

అవీ వద్దు..

మరోవైపు పండుగ వేళ బేరియం సాల్ట్‌తో తయారు చేసిన క్రాకర్స్ విక్రయించకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ సోమేష్ కుమార్ హెచ్చరించారు. బేరియం సాల్ట్‌తో తయారు చేసిన టపాసులు అమ్మొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటికి బదులుగా గ్రీన్ కాకర్స్ అమ్మాలని, వాటినే కాల్చాలని ఆదేశాలు ఇచ్చింది.

గ్రీన్ క్రాకర్స్

గ్రీన్ క్రాకర్స్

పండగ వేళ పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి గ్రీన్ క్రాకర్స్ చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి విషపూరితంగా మారడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

5 రెట్లు ఎక్కువ

5 రెట్లు ఎక్కువ

దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. గాలిలో ధూళికణాలు 60కి మించకూడదు. దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటి వల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది.

హరిత టపాసులు

హరిత టపాసులు


తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి, జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు. తక్కువ బూడిద, ముడి పదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు.

 సాధారణ టపాసులే

సాధారణ టపాసులే

ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్‌ మార్కెట్లతోపాటు ఆన్‌లైన్‌లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+