Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేనున్నా....ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్.. నివేదిక అందజేత

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో లంచ్ చేశారు. ఇక సీఎంతో భేటి అయినవారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న97 డిపోలకు చెందిన కార్మికులు హజరయ్యారు. వారిలో ప్రతి డిపోకు ఇద్దరు మహిళ కార్మికులు కూడ ఉన్నారు. అర్టీసీ సమ్మెలో భాగంగా క్యాబినెట్ సమావేశం అనంతరం కార్మికులతో సమావేశం అవుతానని ప్రకటించిన సీఎం ఆదివారం వారితో భేటి అయ్యారు.

 కార్మికులతో లంచ్ మీటింగ్

కార్మికులతో లంచ్ మీటింగ్


ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ భేటి అయ్యారు. ఆర్టీసీ పరిస్థితిని నేరుగా కార్మికులకు వివరించేందుకు సీఎం వారితో సమావేశం అయ్యారు. ఏ ప్రభుత్వం వచ్చినా...కార్మికుల్లో మార్పు రాకపోవడం, సంస్థ వాస్తవపరిస్థితిని అంచన వేయకుండా సమ్మెలకు దిగుతుండడంతో సీఎం కేసీఆర్ యూనియన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే యూనియన్లు వాస్తవ పరిస్థితిని కార్మికులకు తెలపకపోవడం వల్లే ఆర్టీసీ పరిణామాలకు దారి తీస్తుందని ఆయన భావించారు. ఈనేపథ్యంలోనే యూనియన్లను కాదని కేవలం కార్మికులతో సీఎం సమావేశం కావాలని నిర్ణయించారు.

 కార్మికులకు నివేదిక అందజేత

కార్మికులకు నివేదిక అందజేత

దీంతో ప్రతి డిపోకు 5 చొప్పున కార్మికులను ఆహ్వానించారు. అందులో ఇద్దరు మహిళా కార్మికులకు కూడ అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఆర్టీసీ పరిస్థితిపై ప్రతి అంశాన్ని ప్రింట్ చేసి కార్మికులకు అందించారు. మొత్తం పదిహేను పేజీల నివేదికలో ఆర్టీసీ ప్రస్థానం నుండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అప్పులు, ఆదాయం ,భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందనే అంశాలను పొందుపరిచారు. ఈ సంధర్భంలోనే లంచ్ తర్వాత సీఎం కార్మికులతో సమావేశం అయ్యారు...అనంతరం తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించినట్టు తెలుస్తోంది.. కార్మికులపై స్పందించిన సీఎం భవిష్యత్‌లో ఎలాంటీ సమస్యలు రాకుండా ఆదుకుంటామని హమీ ఇచ్చినట్టు సమాచారం.

నివేదికలోలో ఏముంది.

నివేదికలోలో ఏముంది.

ప్రగతిభవన్‌కు చేరుకున్న కార్మికులకు ఆర్టీసీ పరిస్థితులపై పదిహేను పేజీల నివేదికను అందించారు. వాటిలో ప్రధానంగా ఆర్టీసీకి వస్తున్న నష్టాలను వివరించారు. ప్రస్తుతానికి
2018-19 సంవత్సరంలో సంస్థ 4882 కోట్ల రూపాయలను అర్జించిందని...అందులో సంస్థ వ్యయం 5811 కోట్ల రూపాయలు వ్యయం కాగా...928 కోట్ల రూపాయలు నష్టంలో కొనసాగుతుందని వివరించారు. ఇక ఇలాగే పరిస్థితులు కొనసాగితే... ప్రతి సంవత్సరం కూడ సుమారు 1200 కోట్ల రూపాయలను నష్టం పోతుందని తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఆర్టీసీకి 5269 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని పేర్కోన్నారు.

వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలు

వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలు

2019 డిసెంబర్ నాటికి టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీచేసింది. ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగుల వాటాకు సంబంధించి కనీసం రూ.332.31 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పీఎఫ్ అధికారులు ఆదేశించారు. దీని ప్రకారం.. యాజమాన్య వాటా కింద రూ.455 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా పీఎఫ్‌కు యాజమాన్యవాటాతో పాటు కార్మికుల వాటాను కలుపుకుని మొత్తం రూ.788.30 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.

ఆర్టీసీలో స్టాఫ్...ఒక్కో బస్సుకు 30 మంది కార్మికులు

ఆర్టీసీలో స్టాఫ్...ఒక్కో బస్సుకు 30 మంది కార్మికులు

కాగా ఆర్టీసీలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్లలతో పాటు అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారనే అంశాలను నివేదికలో ఇచ్చారు. ముఖ్యంగా మొత్తం ఆర్టీసీలో ఉన్న 10,460 బస్సులకు గాను 49,733 మంది సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. వీరి సంఖ్య సరాసరి ప్రతి బస్సుకు 30 మంది చొప్పున ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగుల్లో 18,432 మంది డ్రైవర్లు, 20,217 మంది కండక్టర్లు, 5745 మంది గ్యారేజీ స్టాఫ్, 987 మంది సూపర్‌వైజర్లు, 293 మంది అధికారులు, 4059 మంది ఇతర సిబ్బంది ఉన్నాట్టు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+