హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఫిలింనగర్ లోని సత్యనారాయణ నివాసానికి చేరుకుని .. సత్యనారాయణ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాసేపు కైకాల సతీమణితో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.

విలక్షణ నటుడు

విలక్షణ నటుడు

నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడిగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్


కైకాల సత్యనారాయణ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని చెప్పారు. సత్యనారాయణ భౌతికాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు కైకాల పార్థివ దేహానికి పవన్, త్రివిక్రమ్ నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన్ని ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పాలకరించేవారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రాఘవేంద్ర రావు

రాఘవేంద్ర రావు

కైకాల సత్యనారాణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఆయన నటించిన పాత్రలు లేవన్నారు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారని గుర్తుచేసుకున్నారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. ఆయన అజాత శత్రువని కొనియాడారు.

చిరంజీవి

చిరంజీవి

సత్యనారాయణ భౌతికకాయానికి మెగస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం తనని ఎంతగానో కలచివేసిందన్నారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చిరు చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్నారు.

English summary
CM KCR paid tributes to the body of famous film actor Kaikala Satyanarayana. CM KCR reached Satyanarayana's residence in Filmnagar, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X