మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..
ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బంధువులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ భావొద్వేగానికి గురయ్యారు.
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ను చూడగానే నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు బాధను ఆపుకోలేకపోయారు. వారు బోరున విలపించగా.. సీఎం కేసీఆర్ వారిని ఓదార్చారు.

నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషయంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది. గతనెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యం గురించి తెలిసి టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారిని పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.@MPsantoshtrs pic.twitter.com/X7mthY11eV
— TRS Party (@trspartyonline) October 21, 2020
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications