10 నెలల్లో పూర్తి చేయాల్సిందే.. సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ ప్రాంతానికి ఆయన వెళ్లారు. నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. మసీదు, గుడి నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నారు.

సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను ఆగస్టు 7వ తేదీన పరిశీలించారు. రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమైనా.. కరోనా నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. సచివాలయ 6వ అంతస్తు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2022 అక్టోబర్ దసరా నాటికి సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

cm kcr visits secretariat construction area

ఆగస్టులో నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. సచివాలయ నిర్మాణ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదని స్పష్టంచేశారు. నిర్దేశించిన సమయం ప్రకారం పనులు నిర్వహించాలని కోరారు. కరోనా వైరస్ వల్ల కొంత ఇబ్బంది అయినా వచ్చే ఏడాదికి మాత్రం కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ప్రజలకు అందిస్తోన్న మెరుగైన పాలనకు అనుగుణంగా సచివాలయం కూడా అందుబాటులోకి రావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. వసతులు, నిర్మాణ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగవద్దని స్పష్టంచేశారు. సచివాలయ నిర్మాణ పనులను శాపూర్ జీ-పల్లోంజీ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం ఎందుకు అని విపక్షాలు పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రజాధనం వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం.. సచివాలయ నిర్మాణం జరగాల్సిందేనని పట్టుబట్టింది. శరవేగంగా సెక్రటేరియట్ పనులను చేపట్టింది.

Recommended Video

    Lakshya Trailer Review | Akhanda Movie Is The Deciding Factor || Oneindia Telugu

    కరోనా వల్ల పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయి. లేదంటే వేగంగా పనులు జరిగేవి. వచ్చే ఏడాది దసరా నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం గడువు విధించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+