వణికిపోతున్న తెలంగాణ: రోజురోజుకు పెరుగుతున్న చలితీవ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి చలితీవ్రత రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయంపూట, రాత్రివేళల్లో ప్రజలు బయటతిరగాలంటే వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి.

పలు ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా 4.6 డిగ్రీలు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 cold increases in telangana districts gradually due to temperature drops..

మంగళ, బుధవారాల్లో పొడిగా ఉన్నప్పటికీ.. చలి మాత్రం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ వాఖ తెలిపింది. గాలిలో తేమ పెరిగి ఉదయంపూట అధికంగా మంచు కురుస్తోందని పేర్కొంది. రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తుండటంతోనే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని పేర్కొంది.

చలి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట చలిమంటలు వేసుకుంటున్నారు. రాత్రి ఏడుగంటలు దాటితే బయటికి రావడం లేదు. ఉదయంపూట 9 గంటల వరకు చలితీవ్రత ఉంటోంది. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. పిల్లలు, వృద్ధులు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+