ఇదేంది సజ్జనార్ సారూ.. కోడికి టికెట్టు.. రూ.30 కొట్టిన కండక్టర్.. ఎక్కడ అంటే
ఆర్టీసీలో పలు మార్పులను తీసుకు వచ్చారు సజ్జనార్.. ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి ఏదో కొత్త పనులు చేపడుతున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బంది.. తెలిసో.. తెలియకో తప్పులు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ డ్రైవర్ బొప్పాయి పండు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోలేదు. అదీ వైరలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ కండక్టర్ ఏకంగా కోడికి టికెట్ కొట్టాడు. ఇదీ కాస్తా వైరల్ కాగా.. సజ్జనార్ దృష్టికి వచ్చింది.

కోడికి టికెట్టు
ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే. లగేజీలతో పాటు చిన్నపిల్లలకు కూడా బస్పులో టికెట్ తీసుకోవాల్సిందే. పిల్లలకు అయితే హాఫ్ టికెట్.. పెద్దవాళ్లకు ఫుల్ టికెట్ అడుగుతారు. బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణికులకు కండక్టర్‌కు మధ్య టికెట్ విషయంలో చాలాసార్లు వాదన జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో బస్సు కండక్టర్లు చిన్న పిల్లలు సైతం టికెట్ తీసుకోవాల్సిందేని చెబుతుంటారు. కొన్నిసార్లు బస్ కండక్టర్, ప్రయాణికుల మధ్య గొడవ తారా స్థాయికి చేరుతుంది. ఈ క్రమంలో బస్సు నుంచి ప్రయాణికులను దింపేస్తుంటారు. లగేజీ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.

రూ.30 టికెట్టు
బస్సు కండక్టర్ కూడా టికెట్ విషయంలో అదే పనిచేశాడు. లగేజీకో లేదా చిన్నపిల్లలకో కాదు.. కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్ కోడిపుంజుకు రూ.30 టికెట్ కొట్టాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళుతుంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అతడి వెంట ఓ కోడిపుంజు కూడా ఉంది. బస్సు సుల్తానాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో కండక్టర్ తిరుపతికి కోడిపుంజు శబ్దం వినిపించింది. వెంటనే కోడికి రూ.30 టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు.

షాక్..
ఆ టికెట్ చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అదేంటీ కండక్టర్ కోడికి టికెట్ ఏంటి? అని అన్నాడు. ప్రాణంతో ఉండే ప్రతీ జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పడంతో అతని దిమ్మతిరిగి పోయింది. చేసేది ఏమిలేక టికెట్‌కు చిల్లరతో ఇచ్చేశాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఘటనపై స్పందించిన సజ్జనార్.. దృష్టి సారిస్తామని సమాధానమిచ్చారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications