తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ .. వచ్చే వారం రాహుల్ పర్యటన

Recommended Video

    Rahul Gandhi Focus On Telangana For The Lok Sabha Elections | Oneindia Telugu

    హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతోన్న కొద్దీ ప్రచారంపై ఫోకస్ చేశారు. ప్రజల మనసు గెలుచుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతోన్నారు. రెండు, మూడురోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచార పర్వానికి మరింత పదునుపెట్టారు.

    తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ ..

    తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ ..

    ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినప్పటికీ తమను ప్రజలు ఎందుకు ఆదరించడం లేదనే ప్రశ్న ఆ పార్టీ నేతల మదిని తొలచివేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు ఆశించిన సీట్లు రాలేదని .. లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంతో హోరెత్తించిన రాహుల్ .. ఈసారి కూడా అదేస్థాయిలో క్యాంపెయిన్ చేయాలని భావిస్తోన్నారు. దీంతోపాటు ఆ పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి .. కలిసి పనిచేయాలని స్పష్టంచేశారు.

    వచ్చేవారం రాహుల్ పర్యటన

    వచ్చేవారం రాహుల్ పర్యటన

    వచ్చే వారం రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ టూర్ కు సంబంధించి టీ పీసీసీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. 9వ తేదీ శనివారం అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. దీంతోపాటు చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోన్నారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన .. బహిరంగ సభకు సంబంధించి పార్టీ పెద్దలతో పీసీసీ నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది.

    శ్రేణుల్లో జోష్ నింపేనా ?

    శ్రేణుల్లో జోష్ నింపేనా ?

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణపై దృష్టిసారించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో పార్టీ బలోపేత కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేందుకు వ్యుహచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం బెడిసికొట్టడంతో ... పార్లమెంట్ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితం వచ్చేందు కోసం ఏం చేయాలనే అంశంపై .. అన్ని వర్గాలతో చర్చించారు. ప్రజానాడీని పట్టుకునేందుకు మేనిఫెస్టోలో అన్నివర్గాలను ప్రస్తావించి .. విజయం సాధించేందకు వ్యుహరచన చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+