హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Constable Naveena: భళా నవీన.. నీ ప్రయత్నానికి లోకం ఫిదా..

|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రక్తత నెలకొంది. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు భారీగా తరలి వచ్చారు.

ఒక్కసారిగా దూసుకెళ్లారు

ఒక్కసారిగా దూసుకెళ్లారు

గేట్లు ఓపెన్ చేయ్యగానే అభిమానులు ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల వైపు దూసుకెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ లోపు తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్పృహ కోల్పోయింది. పోలీసులు ఆమెను వెంటనే పక్కకు తీసుకెళ్లారు.

నవీన ప్రయత్నం

నవీన ప్రయత్నం

కానీ ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నవీన.. తన నోటి ద్వారా రజితకు శ్వాస అందిస్తూ కాపాడే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నం కొంత ఫలించింది. దీంతో రజితను ఆస్పత్రికి తరలించారు.

ప్రశంసలు

నవీన చేసిన ప్రయత్నాన్ని అందరు ప్రశంసించారు. మానవత్వం చాటిన పోలీసు అంటూ సోషల్ మీడియాలో ఆమె ప్రశంసలు కురుపిస్తున్నారు. కాగా జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 20మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారందరు ఆస్పత్రి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

మహిళ చనిపోలేదు

మహిళ చనిపోలేదు

అయితే కొన్ని న్యూస్ ఛానెళ్లలో ఓ మహిళ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయని.. ఈ తొక్కిసలాటలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదని పోలీసులు తెలిపారు. ఆ మహిళ యశోదలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలైనట్లు వివరించారు. టికెట్ల విషయంలో తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

వెంటనే హెచ్ సీఏ అధ్యక్షుడితో సమావేశం నిర్వహించారు. HCA రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దితే.. బాగుండదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే..స్టేడియానికి ఇచ్చిన స్థలం లీజు రద్దు చేస్తామని చెప్పారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ దాదాపు 55 వేలు కాగా ఇప్పటికే స్పాన్సర్లు, ప్లేయర్లు,ఆన్ లైన్ బుకింగ్ పోను జింఖానాలో మూడు వేల టికెట్లు విక్రయించిన్నట్లు తెలుస్తుంది.

English summary
A stampede took place at the Secunderabad Gymkhana Ground. But the efforts of a woman constable to save the injured woman impressed everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X