తత్కాల్ సిలిండర్: బుక్ చేసిన గంటల్లో సిలిండర్, రూ.25 ఎక్కువ..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు తత్కాల్ సేవలు అందజేస్తోంది. తత్కాల్ సేవ అంటే సిలిండర్ బుక్ చేసిన గంటల్లో అందజేస్తామని స్పష్టంచేసింది. శిలా భారత జీవనం కింద తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసింది. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో కూడా ప్రారంభించబోతోంది.
హైదరాబాద్‌లో ప్రారంభించిన పథకాన్ని కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పథకం అమలు చేయాలని భావించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని అనుకుంటోంది. అయితే తత్కాల్ కింద బుక్ చేసేవారు రూ.25 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తత్కాల్ బుక్ చేస్తే.. సిలిండర్ డెలివరీ చేస్తారు. ఇందుకోసం కొత్త యాప్ కూడా ఆవిష్కరిస్తామని చెబుతున్నారు.

ఆన్ లైన్‌లో బుక్ చేస్తే సిలిండర్ వస్తోంది. అయితే డెలివరీ చేశాక రిసిట్ మాత్రం ఇవ్వరు. నగదుకు సంబంధించి.. మేసేజ్ సెండ్ చేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రారంభించాలని అనుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోంది. రైతు బంధు, రైతు బీమా పథకాలను కూడా అమలు చేసింది. అలాగే తత్కాల్ సిలిండర్ విధానాన్ని కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications