Bigg Boss-4: పీక్‌కి చేరిన కంటెస్టెంట్ల నామినేషన్లు.. ఎత్తులకు పై ఎత్తులు..

బిగ్ బాస్-4 చివరి దశకు చేరుకొంది. ఈ క్రమంలో నామినేషన్లతో మైండ్ గేడ్ ఆడుతున్నారు. తన గేమ్ త‌ను ఆడదామ‌నుకున్న మోనాల్ పలువిధాలుగా ఆలోచించింది. అభిజిత్ ఆమెకు తోడుగా నిలుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక ఒక‌రి కోసం ఒక‌రు త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం లేద‌ని తెలుసుకున్న బిగ్‌బాస్ నామినేట్ అయిన‌వారికి నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు మ‌రో అవ‌కాశం ఇచ్చారు.

నామినేష‌న్స్‌లో ల‌క్ క‌లిసి రాలేద‌ని అరియానా బోరున ఏడ్చేసింది. మోనాల్ ఒంట‌రిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. క‌రెక్ట్ ప‌ర్స‌న్‌తో స్వాప్ చేయ‌మ‌ని చెప్పింది అఖిల్ గురించి అని మోనాల్ చెప్ప‌డంతో హారిక త‌న త‌ప్పును తెలుసుకుని సారీ చెప్పింది. నామినేష‌న్‌లో త‌న‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా అరిచిన‌ అరియానాకు బుద్ధి లేద‌ని కోప్ప‌డింది. ఒక‌రిని తొక్కి ముందుకు వెళ్ల‌డం ఇష్టం లేద‌న్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడ‌ని అఖిల్ సందేహం వ్య‌క్తం చేశాడు.

 contestants nominations are peak level in Bigg Boss-4

బిగ్‌బాస్ "ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్" ప్ర‌వేశ‌పెడుతూ నామినేట్ అయిన‌వారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. మొద‌టి లెవ‌ల్‌లో అవినాష్‌, అరియానా, అఖిల్‌, మోనాల్ పోటీప‌డ‌గా అవినాష్‌, అఖిల్ ఎక్కువ జెండాలు సేక‌రించి రెండో లెవ‌ల్‌కు వెళ్లారు. ఇందులో 'బీబీ- క‌ష్టానికే గెలుపు 'అన్న పార్టీ పేరుతో అఖిల్‌, 'గ‌మ్యం చేరే వ‌ర‌కు' పార్టీ పేరుతో అవినాష్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.ఇప్పుడు నాకు ఓటేస్తే నా జీవితంలో మ‌ర్చిపోలేను అంటూ అవినాష్ హారిక ద‌గ్గ‌ర‌ ఏడ్చేశాడు. దీంతో అరియానా అత‌డికి ధైర్యం నూరిపోసింది. త‌ర్వాత ప్ర‌చార స‌భ‌లు మొద‌లు పెట్టారు.

Recommended Video

    Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show ?

    అఖిల్‌.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవ‌స‌రం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్య‌ర్థించాడు. కానీ పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యేస‌రికి మోనాల్‌, సోహైల్.. అఖిల్‌కు పూల‌మాల వేసి ఓటేయ‌గా అరియానా, అభి.. అవినాష్‌కు ఓటేశారు. హారిక వేసే చివ‌రి ఓటే కీల‌కం కాగా ఆమె అవినాష్‌కే స‌పోర్ట్ చేసింది. దీంతో అవినాష్ ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేన‌ని ఆమెను అమ్మ అని పిలుస్తానంటూ ఓవ‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. అనంత‌రం అత‌డికి రెండు వారాల వాలిడిటీ ఉండే ‌ఇమ్యూనిటీ ద‌క్కింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+