అలర్ట్.. అలర్ట్... ఎంతపని చేస్తున్నావే కరోనా: గుండెపై ప్రభావం, కుప్పకూలుతోన్న జనం..
కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. అధ్యయనాల్లో వెలుగులోకి వస్తోన్న అంశాలను పరిశోధకులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశంలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదీ శుభపరిణామమే.. అయితే కరోనా సోకిన వారు వివిధ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వైరస్ నుంచి బయటపడిన వారు కీలక అవయవాలపై ప్రభావం చూపుతుందట. ఇదే విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారనంతో దీనికి మరింత బలం చేకూరుతుంది.

గుండెపై ప్రభావం..
గుండెపై వైరస్ తీవ్రప్రభావాన్ని చూపిస్తోంది. గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండానే వైరస్ సోకిన వారిలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో కుప్పకూలిపోతున్నారు. ఈ విషయాన్ని అధ్యయనాలు ధృవీకరించాయి. వైరస్ ప్రభావం గుండె లోపల ఉండే కణాలపై పడుతుండటంతో ముప్పు ఏర్పడుతుందని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో తేలింది. గతంలో ఎలాంటి గుండె సంబంధ సమస్యలు లేకపోయినా కరోనా వైరస్ సోకిన తర్వాత హృదయ కండరాలు ప్రభావితం అవుతున్నాయని.. చివరకు ప్రాణాంతకంగా మారుతున్నట్లు హ్యూస్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ అధ్యయనంలో తేలింది.

లంగ్స్‌తోపాటు
కరోనా వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమై, ఊపిరితిత్తుల దెబ్బతీస్తున్నాయని అంతా భావిస్తున్నారు. కానీ వైరస్ ప్రభావం గుండెపై కూడా ఉంటుందని వారు గుర్తించారు. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారికి మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. వయస్సు పైబడిన వారిలో ఇలాంటి మరణాలు అధికంగా ఉంటున్నాయని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ దాడి చేయటం వల్ల గుండె పనితీరులో మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వచ్చి పోయిందని, దాని నుంచి బయటపడ్డామని చాలా మంది భావిస్తున్నారు. తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ అంతర్లీనంగా వైరస్ ప్రభావం మాత్రం కొనసాగుతుందనే కఠోర నిజం అధ్యయనంలో తేలింది.
Recommended Video

అలర్ట్.. అలర్ట్...
కరోనా వైరస్ మాత్రం వయసు పైబడిన వారికి.. అలాగే గుండె సంబంధిత సమస్య ఉన్నవారికి తీవ్ర ముప్పుగా మారింది. సో సమస్య ఉన్న వారు వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు.. లేదంటే ప్రమాదం పొంచి ఉంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా చాలా ఫిట్‌గా ఉండేవారు.. కానీ ఆయనకు గుండెపోటు రావడం.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోవడంతో మిగతవారిని అప్రమత్తం చేస్తోంది. సో బీకేర్‌ఫుల్‌గా ఉండటం బెటర్.. హెల్త్ విషయంలో నెగ్లిజెన్సీ అవసరం లేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications