హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: దేశ అభివృద్ధిపై డీహెచ్ శ్రీనివాసరావు సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏసుక్రీస్తు దయ వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గిందన్న డీహెచ్ శ్రీనివాసరావు

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గిందన్న డీహెచ్ శ్రీనివాసరావు


మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్ధిని నేర్పిందారు శ్రీనివాసరావు. ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థంగా మార్చిందన్నారు. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయటపడలేదు. ఏసుక్రీస్తు కృప, దయ వల్లే కరోనా తగ్గిందని డీహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వారి వల్లే దేశం అభివృద్ధి అంటూ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు

వారి వల్లే దేశం అభివృద్ధి అంటూ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు

కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని.. దానిని అందరూ ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఆధునిక సంస్కృతి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ.. అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులు. ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు. ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదు. ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసిందని శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఈ వ్యాఖ్యలు బ్రిటీషువారిని కీర్తించినట్లు ఉండటం గమనార్హం.

గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కడంపై శ్రీనివాసరావుపై విమర్శలు

గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కడంపై శ్రీనివాసరావుపై విమర్శలు


కాగా, డీహెచ్ శ్రీనివాసరావు తీరు గతంలోనూ వివాదస్పదమైంది. రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రగతిభవన్ నుంచి వర్చువల్ ద్వారా మెడికల్ కాలేజీల్లో క్లాసులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లకు శ్రీనివాసరావు రెండుమూడు సార్లు మొక్కారు. దీంతో టీఆర్ఎస్ టికెట్ కోసమే కేసీఆర్ కాళ్లకు మొక్కారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. అయితే, తాను కాళ్లు మెుక్కటంపై శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని.. ఒక్కసారి కాదు వందసార్లైనా కాళ్లు మొక్కుతానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

English summary
Coronavirus has reduced due to the grace of Jesus Christ: Telangana DH Srinivasa rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X