మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్‌సీకి దంపతుల ఫిర్యాదు
గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభం అయ్యాయని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు ఆరోపించారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామనే కక్షతో తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు. తమ ఇంటిల్లిపాదులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగం నుంచి తీసివేయించారని విలపించారు. తమకు ఉపాధి కరవైందని గోడును కమిషన్‌కు వెల్లబోసుకున్నారు. తమ బతుకు ఎలాగోలా బతుకుతున్నామని.. ఇకనైనా వేధింపులు ఆపాలని కోరారు. మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్‌హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి లేఖపై కమిషన్ స్పందించాల్సి ఉంది.
బాధ్యతయుతమైన పదవీలో ఉన్న మంత్రి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ పర్సనల్ విషయాలను కూడా పోలీసుల చేత బెదిరింపులకు దిగడం మంచి పద్దతి కాదని పలువురు అంటున్నారు. మంత్రిగా ఏం ప్రమాణం చేశారు.. ఇప్పుడు ఎలా బీ హేవ్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications