సాయుధ పోరాటం కమ్యూనిస్టుల హక్కు, ఆ పార్టీలు లేవు: సీపీఐ నారాయణ
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి.. ఒక్కో పార్టీ ఒకలా చెప్పుకుంటుంది. ఇప్పుడు సీపీఐ నారాయణ లైన్‌లోకి వచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు అని అంటున్నారు. అంతేకాదు దాని గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు.
చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను కొందరు తమ స్వార్థం కోసం హైజాక్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఇప్పుడు మాట్లాడే ఏ పార్టీలు లేవన్నారు. సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు మీకు ఉందా? అని ఆ పార్టీలను ప్రశ్నించారు.

బీజేపీ ఎక్కడ ఉంది..?
స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ ఎక్కడుందని నారాయణ ప్రశ్నించారు. ఆ విషయాన్ని మరచి ఉద్యమంలో పాల్గొన్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో కాదు అసలు ఏ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందని అడిగారు. సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు ఉందా అని కొశ్చన్ చేశారు.

వారి సొంతమా..?
సెప్టెంబర్ 17 చరిత్ర గురించి ఆయా పార్టీల నేతలు వారి సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ విమోచన దినం అంటూ ఎప్పుడు లేనిది బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టి తెలంగాణ అమరవీరులను స్మరించింది.

టీఆర్ఎస్ ఇలా..?
టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించింది. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను వక్రీకరిస్తున్నారని..చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని అప్రమత్తంగా లేకపోతే సమాజాన్ని అల్లకల్లోలం చేస్తారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

బీజేపీ, టీఆర్ఎస్‌పై రేవంత్
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అటు బీజేపీపైనా..ఇటు టీఆర్ఎస్ పైనా విమర్శలు సంధించారు.దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెసే నని స్పష్టంచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర అసలు ఉందా? అని అడిగారు. కాంగ్రెస్ పోరాడిందని అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications