మునుగోడులో టీఆర్ఎస్‌కే సీపీఎం మద్దతు: కేసీఆర్ రాజకీయాలపై తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే తాము మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పస్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్‌కు మద్దతన్న తమ్మినేని

బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్‌కు మద్దతన్న తమ్మినేని

బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ కూడా తమ మద్దతు కోరిందని, అయితే, తాము మాత్రం టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో బలమున్నా.. మూడో స్థానానికే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

బీజేపీని గెలిపిస్తే టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తారా?: తమ్మినేని

బీజేపీని గెలిపిస్తే టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తారా?: తమ్మినేని


మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని.. పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ఆయన నిలదీశారు.

టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్సే కానీ..: వీరభద్రం

టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్సే కానీ..: వీరభద్రం


ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీతో బెదిరింపులకు బీజేపీ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు తమ్మనేని వీరభద్రం. రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారే అవకాశముందన్నారు. కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్లాన్లు వేస్తోందన్నారు.

మునుగోడు వరకే టీఆర్ఎస్‌కు మద్దతంటూ తమ్మినేని వీరభద్రం

మునుగోడు వరకే టీఆర్ఎస్‌కు మద్దతంటూ తమ్మినేని వీరభద్రం


సీపీఐలా తాము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని.. మునుగోడు ఉప ఎన్నిక వరకే తాము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, తాము మద్దతు ఇచ్చినంత మాత్రాన సమస్యలపై పోరాటాలు ఆగవని.. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిసి రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తమ్మినేని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+