ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన సురేష్ రెడ్డి
హైదరాబాద్ : ఫోర్బ్స్ లిస్టులో మరో హైదరాబాదీకి చోటు దక్కింది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత కొవ్వూరి సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కోటీశ్వరుల లిస్టులో చోటు దక్కించుకున్నారు. 30ఏళ్ల లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాలో ఆయన ఒకరిగా నిలిచారు.
సురేశ్ రెడ్డికి పలువురి ప్రశంసలు
కంపెనీని స్థాపించిన 13 ఏళ్లలో అతిచిన్న వయసులో సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన సురేశ్ కృషి, పట్టుదల అభినందనీయమని అన్నారు.

జీవితంలో మరచిపోలేని అనుభూతి
ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అన్నారు సురేశ్ రెడ్డి. చిన్న వయసులోనే సినీ రంగంలో గొప్ప పేరు సాధించిన ప్రముఖ డైరెక్టర్, నిర్మాత ఎల్ వీ ప్రసాద్ స్పూర్తిగా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ క్యాప్చర్ యానిమేషన్ సృష్టించిన ఘనత తమ కంపెనీ సొంతమన్న ఆయన.. ఇప్పటి వరకు తమ వద్ద శిక్షణ పొందిన 3వేల మంది విద్యార్థులు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. డాక్టర్ పీ శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, శివనాడార్, యదూపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, అనిల్ రాయ్ గుప్తా, ఆనంద్ మహీంద్రా తదితర 51 మంది ప్రముఖ వ్యాపారుల మధ్య తన పేరు ఉండటం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని సురేశ్ సంతోషం వ్యక్తంచేశారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications