Custard apple: సీతాఫలాల సీజన్ మొదలైంది.. ధర ఎంతంటే..!

చలికాలం రాగానే మనకు గుర్తోచ్చేవి ఏముంటాయి.. స్వెట్టర్లు, వ్యాసిలెన్లు.. ఇంకా.. అవును ఇంకా ఉంది. శీతాకాలం అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి సీతాఫలాలు.. అవును ఇవి కేవలం సీజన్ లోనే లభిస్తాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. సీతాఫలాలు అడవుల్లో సమృద్ధిగా లభిస్తాయి. కొండల్లో సీతాఫలాల చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీతాఫలాలు ఊళ్లలోనే కాదు సిటీలో కూడా విరివిగా లభిస్తున్నాయి.

ఇంకా చలికాలమే రాలేదు.. ఇదంతా ఎందుకు అంటారా.. చలికాలం రాలేదు కానీ.. సీతాఫలాలు మాత్రం వచ్చాయి. అవును చాలా ప్రాంతాల్లో చింతవలక పండ్లు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కు కూడా సీతాఫలాల రాక మొదలైంది. వనపర్తి, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, భువనిగిరి యాదాద్రి, నల్గొండలోని కొండ ప్రాంతాలలో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా అధిక గిరాకీని ఊహించి వ్యాపారులు మంచి రకాల పండ్లను కొనుగోలు చేస్తున్నారు.

Custard apples

పురానాపూల్‌, తాడ్‌బన్‌, ఎర్రగడ్డ, మెహదీపట్నం, చాదర్‌ఘాట్‌, ఎల్‌బీనగర్‌, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు గిరిజనుల నుంచి తెచ్చిన పండ్లను విక్రయించడం ప్రారంభించారు. గిరిజనులు అటవీ ప్రాంతాల నుంచి పండ్లను సేకరించి నగరానికి తీసుకువస్తున్నారు. "ఒక కిలో సీతాఫలాలు రూ. 200 నుంచి రూ. 300 మధ్య విక్రయిస్తున్నారు. పక్షం రోజుల క్రితమే సీతాఫలాల రాక మొదలైంది. రానున్న రోజుల్లో మార్కెట్‌లో పండ్లు పుష్కలంగా వస్తాయని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు.

Custard apples

సీతాఫలం సీజన్ నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే హైబ్రిడ్ సీతాఫలాల కంటే అడవి సీతాఫలాలు మంచివని చెబుతున్నారు. ఎలాంటి కెమికల్స్, ఎరువులు లేకుండా అడవి చింతవలక పండ్లు ఉంటాయని వివరిస్తున్నారు. సో మీరు కూడా సీతాఫలాలను ఓసారి ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+