శంషాబాద్‌లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేత
ఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగారాన్ని మలేషియా నుండి హైదరాబాద్‌కు తరలిస్తుండగా స్వాధినం చేసుకున్నట్టు తెలుస్తోంది.
గత కొద్ది కాలంగా మలేషీయా, సింగపూర్ దేశాల నుండి అనుమతులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆయా దేశాల నుండి వస్తున్న పార్శీళ్లను అధికారులు తనిఖీలు చేశారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధినం చేసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం ఆర్కే డిజిటల్ అనే ఓ సంస్థ తీసుకొచ్చినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది.. కాగా బంగారం రవాణ వెనక ఇతర పెద్దల హస్తం ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆర్కే డిజిటల్‌కు అనుమతులు లేకున్నా, బంగారాన్ని రవాణ చేస్తున్నాట్టు కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇలా ఎన్ని రోజుల నుండి వ్యవహారం కొనసాగుతుందనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications