స్కూల్‌లో వంట మనిషిగా తల్లి.: సివిల్స్ ర్యాంక్ సాధించిన దళిత యువకుడు రేవయ్య
హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్(civils)-2022 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఈ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఓ దళిత యువకుడు సివిల్స్ ఎంపిక కావడం అందరికీ స్ఫూర్తిగా నిలుచాడు. కుమురంభీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన డోంగ్రే వీరయ్య అలియాస్ రేవంత్ సివిల్స్‌కు ఎంపికయయారు.
అతని కుటుంబంలో చోటు చేసుకున్న విషాదాలను దిగమింగుకుని ఈ విజయం సాధించాడు. రేవయ్య తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తుండటం గమనార్హం. ఐఐటీ-మద్రాస్ నుంచి పట్టభద్రుడైన రేవయ్య.. సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022 ఫలితాల్లో 410 ర్యాంక్ సాధించారు.

కుమురంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగేడ్ గ్రామానికి చెందిన రేవయ్య చిన్నతనంలోనే తండ్రి మనోహర్ అనారోగ్యంతో చనిపోయారు. అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే తన తల్లి విస్తారి బాయి అందించిన ప్రోత్సాహం, మద్దతుతో రేవయ్య సివిల్స్ లో విజయం సాధించారు.
దళిత వర్గానికి చెందిన రేవయ్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్సీ పరీక్షపై ప్రత్యేక దృష్టి సారించారు. అతను తన విజయానికి తన తల్లి తిరుగులేని మద్దతు, తన ఆశయానికి తన స్వంత పట్టుదల, అంకితభావం కారణమని చెప్పుకొచ్చారు.
ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు
రేవయ్య హైదరాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆసిఫాబాద్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్‌లో చదువుకున్నారు. కాగజ్‌నగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కాగా, మంచిర్యాలలోని దండేపల్లి మండలం కర్ణపేట్ గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35వ ర్యాంకు సాధించారు. ఆయన ఉద్యానవన శాఖ అధికారి ప్రేమ్‌సింగ్ నాయక్ కుమారుడు.
యూపీఎస్సీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు
కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ ఆలిండియా తొలి ర్యాంకు సాధించగా, గరిమ లోహియా(బీహార్) రెండో ర్యాంక్ సాధించింది. తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు. మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి.. నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం గమనార్హం. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్. ఇక యూపీకి చెందిన స్మృతి మిశ్రా(యూపీ) నాలుగో ర్యాంక్ సాధించారు.
2022 ఏడాదికి గానూ మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టులవారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ కేటగిరిలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా సత్తా చాటారు.
ఈసారి సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఈసారి కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు. నూకల ఉమా భారతి మూడో ర్యాంక్ సాధించగా.. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.
హెచ్ఎస్ భావనకు 55, సాయి ప్రణవ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రామ్‌దేని సాయినాథ్ 742, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించారు. కాగా, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications