దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా.. రాజకీయ లబ్దే ముఖ్యం: సీతక్క సెటైర్లు

సీఎం కేసీఆర్ దళితబంధును అలా ప్రారంభించారో లేదో.. విమర్శల జాడివాన కురుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తొలుత ఫైర్ బ్రాండ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ నెల 18న ర్యావిరాలలో జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభా స్థలాన్ని టీవర్కింగ్ ప్రైసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ వైస్ ప్రైసిడెంట్ వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య నాయకులు మల్‌రె‌డ్డి రంగారెడ్డి, మల్‌రె‌డ్డి రామ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి సోమవారం పరిశీలించారు.

ఓట్ల కోసమే..

ఓట్ల కోసమే..

కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం దళిత, గిరిజన ఓట్ల కోసం దళిత బంధు తెస్తున్నారని ఫైరయ్యారు. దళిత బంధు ఒక్క హుజురాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతటా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు లాగే బీసీ బంధు, గిరిజన బంధు లాంటి పథకాలు తేవాలన్నారు. మద్యం బంద్ చేయకపోతే రాష్ట్రంలో ఎన్ని పథకాలు అమలు చేసినా పేదలకు ప్రయోజనం లేదని సీతక్క పేర్కొన్నారు.

హామీ నెరవేర్చలే

హామీ నెరవేర్చలే

టీఆర్ఎస్ దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. దళిత బంధు పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు తప్ప వారి ప్రయోజనం కోసం చేస్తున్న పనులేమీ లేవని మండిపడ్డారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రావిర్యాల గ్రామంలో దళిత, గిరిజన దండోరా సభ జరుగుతుందని చెప్పారు. సభలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మనిక్కమ్ ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య నాయకులు పాల్గొంటారని వివరించారు.

దళితబంధు

దళితబంధు

ప్రభుత్వ దళిత ఉద్యోగులకు దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్న‌ ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో డ‌బ్బులు అందజేస్తామన్నారు. హుజూరాబాద్ కాడ అంద‌రికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలన్నారు. 25 ఏళ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ సమయంలో.. సిద్దిపేట ద‌ళిత చైత‌న్య జ్యోతి అని ప్రారంభించామని వివరించారు. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాట‌లు రూపొందించామని చెప్పారు. గత 25 ఏళ్ల నుంచి తన మెదడులో ఉందన్నారు. ప్ర‌పంచంలో అణ‌గారిన జాతులు ఎన్నో ఉన్నాయని వివరించారు. దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయని చెప్పారు. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని సీఎం అన్నారు.

17 లక్షల కుటుంబాలు

17 లక్షల కుటుంబాలు

ఇప్పటికీ సామాజిక వివ‌క్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలన్నారు. తెలంగాణ నుంచి చేసే ప‌ని దేశ‌మంతా వ్యాపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చేస్త‌మంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. రెండు నెల‌ల్లో హుజూరాబాద్‌లో ప‌థ‌కం అమ‌ల‌వుతుందన్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో హుజూరాబాద్ ద‌ళితులే ఆద‌ర్శం కావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 17 ల‌క్ష‌ల పైచిలుకు ద‌ళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. రైతుబంధు త‌ర‌హాలోనే ద‌ళిత బంధు వ‌స్త‌ోందని చెప్పారు గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులైన ద‌ళిత సోద‌రుల‌కు కూడా ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రైతు బంధు ఇస్తున్నప్పుడు

రైతు బంధు ఇస్తున్నప్పుడు

ఒకరికీ 4 ఎక‌రాల భూమి ఉంటే రైతుబంధు వ‌స్తుందని.... రైతుబంధు లాగే ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని చెప్పారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివ‌రి వ‌రుస‌లో ఉండి తీసుకోవాలన్నారు. ద‌ళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయని వివరించారు. అలాంటి వారికి తొలి వ‌రుసలో ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చుకుంటూ పోతామని.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ద‌ళితబంధు ఇచ్చే హామీ తనదన్నారు. రెండు పూట‌లు పస్తులుండే వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారని.. వారు ముందుగా తీసుకోవాలని కోరారు. అత్య‌ధికంగా జ‌నాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలేనని చెప్పారు. 75 ల‌క్ష‌ల జ‌నాభా ఉందని.. అతి త‌క్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలేనని చెప్పారు. ఇది ప్ర‌జాస్వామ్యం.. అయితే ప్ర‌జ‌లు ప్ర‌భువులు అయితే ద‌ళితులు ఎందుకు ప్ర‌భువులుగా లేరని ప్రశ్నించారు. ఈ వివ‌క్ష ఎన్ని శ‌త‌బ్దాలు కొన‌సాగాలని. ఇది సరికాదని సీఎం కేసీఆర్ చెప్పారు.

అప్పుడు.. ఇప్పుడు

అప్పుడు.. ఇప్పుడు

ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టానని గుర్తుచేశారు. రైతు బంధు కార్య‌క్ర‌మం బ్ర‌హ్మాండంగా నడుస్తోందని చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నామని.. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగిందని వివరించారు. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన స‌భ‌లో రైతుబీమా ప్ర‌క‌టించానని.. కేసీఆర్ గుర్తుచేశారు. ఆ స్కీం కూడా అద్భుతంగా కొన‌సాగుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో మ‌హోత్త‌ర‌మైన, కొత్త చ‌రిత్ర‌ను సృష్టించే, త‌ర‌త‌రాల దోపిడీ నుంచి, సామాజిక వివ‌క్ష నుంచి ద‌ళిత స‌మాజం శాశ్వ‌తంగా విముక్తి పొందటానికి మరో ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. తెలంగాణ సాధ‌న‌లో తొలిసింహ గ‌ర్జ‌న నుంచి నేటి వ‌ర‌కు సెంటిమెంట్‌గా బ్ర‌హ్మాండ‌మైన పద్ధతుల్లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌యం చేకూరే వేదిక‌గా కరీంనగర్ జిల్లా మారిందని వివరించారు.

అంజలి ఘటించి

అంజలి ఘటించి


ఇక్కడి నుంచే అద్భుత‌మైన ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నానని వివరించారు. మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవన్ రామ్‌కు పుష్పాంజ‌లి ఘ‌టించి శ్రీకారం చుడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ద‌ళితబంధు ప్ర‌భుత్వ కార్యక్రమం కాదు. కాకూడ‌దు అన్నారు. ఇది ఒక మ‌హా ఉద్య‌మం. ఈ ఉద్య‌మం క‌చ్చితంగా విజ‌యం సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన సమయంలో చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవన్నారు. మీ అంద‌రి దీవ‌నెలు, ఆశీర్వాదాలతో రాష్ట్రం న‌లుమూలుల ఉద్య‌మం ఉవ్వెత్తున చెల‌రేగి 14, 15 సంవత్సారల కృషి త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఇవాళ స‌గ‌ర్వంగా దీవిస్తున్నారని.. అనేక రంగాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించాం అని చెప్పారు. ప్ర‌తి రోజు ప్ర‌తి నిత్యం మీ కళ్ల ముందు గ్రామాల్లో, మండ‌లాల్లో, మీ అనుభ‌వంలో చాలా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+