డాన్స్ మాస్టర్ వికృత చేష్టలు.. బాడీ షేప్ మారుతోందని చెప్పి.. తాకి,

హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శిక్షణ పేరుతో డ్యాన్స్ మాస్టర్ వికృతంగా ప్రవర్తించాడు. ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేశాడు. గదిలోకి పిలిచి తాకరాని చోట తాకి పైశాచిక ఆనందం పొందాడు. విషయం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. పేరంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతనిని అరెస్ట్ చేశారు.

షేప్ మారుస్తానని చెప్పి..

షేప్ మారుస్తానని చెప్పి..

తిరుమలగిరి దుర్గ విహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్ పల్లి మార్కెట్ సమీపంలో అర్బన్ డాన్స్ వరల్డ్ లో కొన్నిరోజులుగా డ్యాన్స్ శిక్షణ తీసుకుంటోంది. డ్యాన్స్ వల్ల శారీరక వ్యాయామం కలుగుతుందని, శరీరాకృతి కూడా చాలా చక్కగా మారుతుందని, నడుము దగ్గర కొవ్వు తగ్గిస్తామని చెప్పి బాలికను తమ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేసుకున్న నిర్వాహకుడు.. ఆ తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు.

ఉదయం 7 నుంచి 8 వరకు

ఉదయం 7 నుంచి 8 వరకు

ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు వర్కౌట్ కి రావలసిందిగా నిర్వాహకుడు సూచించాడు. మార్చి 26 నుండి ఉదయం సమయంలో బాలిక వర్కౌట్స్‌కు వెళుతోంది. ఈ క్రమంలో నిర్వాహకుడు బాలికపై కన్నేశాడు. శిక్షణ పేరుతో బాలికను గదిలోకి తీసుకెళ్లి తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక బిత్తరపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సదరు డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.

చర్యలు తీసుకోవాలని వినతి

చర్యలు తీసుకోవాలని వినతి

డ్యాన్స్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పేరంట్స్ కోరుతున్నారు. లేదంటే మరొకరికి కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతుందని చెప్పారు. శిక్షణ పేరుతో వికృతంగా ప్రవర్తించడం ఏంటీ అని వాపోతున్నారు. డ్యాన్స్ స్కూల్ మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+