కూతురి స్నేహితురాలితో పాడుపని, మనువడుతానని వంచన : మాటతప్పడంతో పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : ఆమె తన కూతురు లాంటిది. బిడ్డ కోసం ఇంటికొస్తే తండ్రి కన్నేశాడు. రోజులానే ఆ రోజు ఇంటికొచ్చింది ఆమె. కానీ స్నేహితురాలు కాదు వారింట్లో ఎవరూ లేరు ఒక తండ్రి తప్ప. తన కూతురి స్నేహితురాలిని బిడ్డలానే చూడాల్సిన తండ్రి .. కామంతో కాటేశాడు. తండ్రిరూప రాక్షసుడు చేసిన తప్పుతో ఆమె తల్లయ్యింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
తండ్రిరూప రాక్షసుడు ..
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హలీమ్ తయారు చేస్తుంటాడు. అతను బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉంటున్నాడు. గతంలో బొగ్గులకుంటలో కుటుంబంతో పాటు ఉండేవాడు. షరీఫ్‌కు భార్య, కూతురు ఉన్నారు. కూతురు చదువుకొవడంతో ఆమె స్నేహితురాలు కూడా అప్పుడప్పుడు ఇంటికొచ్చేది. అదే ఆమె పాలిట శాపమైంది. జీవితం నాశనమయ్యేందుకు కారణమైంది. ఎప్పటిలాగే ఒకరోజు తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది యువతి. అయితే తన ఫ్రెండ్, వారి అమ్మ ఇంట్లో ఎవరూ లేరు. ఒక్క తండ్రి మాత్రమే ఉన్నాడు. అప్పటికే కామంతో రగిలిపోతున్నాడో ఏమో కానీ .. ఆ యువతికి మాయమాటలు చెప్పాడు. వెళ్ళొస్తానని చెపితే తన కూతురు వస్తుందని .. చెప్పి మాటల్లో పెట్టి అఘయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ అభాగ్యురాలు తల్లయ్యింది.

ఇదేం పని ?
జరిగిన దారుణం తెలిసి యువతి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షరీఫ్‌ను నిలదీశారు. ఇదేం పని అని అడగగా .. పెళ్లి చేసుకుంటామని షరీఫ్ మాయమాటలు చెప్పాడు. తన కూతురు జీవితం .. ఎలాగూ నాశనం అయ్యింది కదా .. పెళ్లి చేసుకుంటానంటే .. మరోకరితో పెళ్లి అవుతుందో లేదోననే బెంగ వారిని వెంటాడింది. దీంతో షరీఫ్ చెప్పిన పెళ్లి ప్రతిపాదనకు కూడా అంగీకారం తెలిపారు. కానీ ఆ మాటను కూడా మరచిపోయాడు. దీంతో వారు నిలదీయడంతో షరీఫ్ సోదరుడు రంగంలోకి దిగాడు. బాధితులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో చేసేదేమి లేక బాధిత కుటుంబసభ్యులు ఫలక్‌నుమా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు అక్కడి నుంచి నారాయణగూడ పీఎస్‌కు బదిలీ కాగా .. షరీఫ్, చాంద్‌పై కేసు నమోదు చేశారు. నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications