హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వద్దంటే వాన: ఎల్లుండి భారీ వర్షం.. ఇవాళ, రేపు కూడా..

|
Google Oneindia TeluguNews

గులాబ్ తుఫాన్ చేసిన బీభత్సం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేతికి వచ్చిన మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక హైదరాబాద్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. వర్షం వెలవడంతో జనం కాస్త ఊపిరి తీసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు.. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ గ్యాంగ్‌టక్ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 10 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలో కొన్ని ప్రదేశములలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు, కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి శుక్రవారం అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రేపు,ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశమే. తేలికపాటి జల్లులు కురిస్తేనే హైదరాబాద్ మహానగరం చిత్తడి అవుతోంది. ఇటీవల కురిసిన వర్షంతో సిటీలో గల గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్నవారి పరిస్థితి వర్ణణాతీతం.

day after tomorrow heavy rain in telangana state

ఇటీవల కురిసిన వర్షంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల సూచించారు. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో నగరమంతా జలమయం అయ్యింది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి.

తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ ఇటీవల రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉండగా. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

English summary
day after tomorrow heavy rain in telangana state weather officials said to statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X