Rachakonda CP: డ్రైవర్ పై సీపీ ప్రతాపం.. వైరల్ అవుతోన్న వీడియో..!

హైదరాబాద్ శివారు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ సభ వద్ద ఉన్న పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ ను లోపలికి అనుమతించలేదు. రాచకొండ సీపీ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. కారును పక్కకు ఆపారు.

అయితే డ్రైవర్ శ్రీనివాస్ వాహనానికి డయాస్ పాకు ఉందని చెప్పినప్పటికీ సీపీ వినిపించుకోలేదు. శ్రీనివాస్ పై చెయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏసీపీతో కూడా కొట్టించారు. దీన్నంతటిని ఓ వ్యక్తి వీడియో తీశారు. ఆ వ్యక్తి పై కూడా పోలీసులు చెయి చేసుకున్నారు. మొబైల్ లాక్కున్నారు. అయినప్పటికీ అక్కడున్నవారు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసుల తీరు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Deputy CM Bhatti Vikramarka wrote the convoy driver and issued a CP

డ్రైవస్ శ్రీనివాస్ జరిగిన విషయాన్ని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీపీ తీరుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కొంత మంది పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపుతారు. యూనిఫామ్ వేసుకోగానే.. హీరో లాగా ఫీల్ అవుతారని పలువురు చెప్పుకుంటున్నారు. ఇదే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వ్యక్తి పై ఆకారణంగా చెయి చేసుకున్నారు.

ప్రకాశ్ అనే యువకుడు నిన్న ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఓ ఆకతాయి ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ప్రకాశ్ ఈ విషయాన్ని సమీపంలో ఉన్న కానిస్టేబుళ్లకు చెప్పాడు. అయితే సదరు కానిస్టేబుళ్లు యువకుడిపైనే ప్రతాపం చూపారు. దీంతో ప్రకాశ్ ఎల్బీనగర్ కు వెళ్లి కానిస్టేబుళ్ల ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+