జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిని చంద్రబాబు ఆపాలని ప్రయత్నించారా..?

జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య కొంత గ్యాప్ ఉందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. 2009 ఎన్నికల తరువాత జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొడుకు నారా లోకేష్ రాజకీయ జీవితం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీకి దూరం చేశారనే మాటలు పార్టీలోనే వినిపించాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాలకు దూరం ఉంటూ ..సినిమాల్లో నటిస్తున్నారు. అనతి కాలంలోనే తన స్టార్ డంను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిని చంద్రబాబు ఆపాలని ప్రయత్నించారని ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిగింది. చంద్రబాబు చొరవతోనే తారక్ వివాహం జరిగిందని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. కాని తాజాగా లక్ష్మీ పార్వతి దానికి విరుద్దంగా మాట్లాడి సంచలనం సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్‌ది మన సామాజికవర్గం కాదని..అలాంటిది ఆయనకు మన పిల్లను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

Chandrababu

ఈ విషయాన్ని లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు తనకు స్వయంగా చెప్పినట్టు లక్ష్మీ పార్వతి వెల్లడించారు.అయితే లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబే వల్లే లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిగిందని వారంటున్నారు. ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆయన గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ..అలాంటిది ఏమి జరగలేదు. వైసీపీలో నార్నె శ్రీనివాసరావుకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+