Bhola Shankar : మెహర్ రమేశ్‌ను నిండా ముంచేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన 'భోళాశంకర్'. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో అనిల్ సుంకర నిర్మించారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భోళాశంకర్' మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేదని మెగా అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో 'భోళాశంకర్' సినిమాను చూడటానికి సాధారణ ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచకపోవచ్చనే కామెంట్స్ తెర మీదకు వస్తున్నాయి.
అసలు సినిమాలో తీసుకున్న కథ సరైంది కాదని.. కథలో కొత్తదనం లేదని అంటున్నారు. 'తమిళంలో సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందింది ఈ చిత్రం. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసినప్పటికీ కూడా లాభం లేకుండాపోయింది. సిస్టర్ సెంటిమెంట్‌తో చాలానే సినిమాలు వచ్చాయని.. వాటికి భిన్నంగా 'భోళాశంకర్' ఏమి లేదని ప్రేక్షకులు అంటున్నారు. కీర్తి సురేష్‌ను చిరంజీవి చెల్లెలుగా ప్రేక్షకులు చూడలేకపోయారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మెగా అభిమానులే సినిమా యావరేజ్ అని తేల్చేయడంతో.. రెండో రోజు నుంచి వసూళ్లు పడిపోతాయని చిత్ర యూనిట్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక సినిమా హిట్ అయితే తమ ఖాతాలో.. ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలో వేస్తారనే అపవాదు చిరంజీవికి ఎలాగూ ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆచార్య విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని.. సినిమా ప్లాప్ కావడంతో .. డైరెక్టర్ కొరటాల శివ ఖాతాలో వేసేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెహర్ రమేశ్ పరిస్థితి కూడా అంతే అని అంటున్నారు.

చాలాకాలం తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. బిల్లా, కంత్రి,శక్తి, షాడో వంటి సినిమాలకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. వీటిల్లో బిల్లా తప్పితే..మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచాయి. దాదాపు 10 సంవత్సరాల తరువాత మెగాఫోన్ పట్టినప్పటికీ కూడా మెహర్ రమేశ్‌కి అదృష్టం కలిసి రాలేదు. చిరంజీవికి ఈ సినిమా కాకపోతే మరో సినిమా వస్తుందని.. కాని మెహర్ రమేశ్ పరిస్థితి ఏంటా అని నెటిజన్లు బాధపడుతున్నారు. 'భోళాశంకర్' సినిమాతో మెహర్ రమేశ్ నిండా మునిగినట్లే అని సినీ పండితులు చెబుతున్నారు. మరి మెహర్ రమేశ్‌కి మరోసారి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications