హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha Murder case: శాడిజం: దిశ అత్యాచారం, హత్యపై అశ్లీలకర పోస్టింగులు..యువకుడి అరెస్టు..!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: శాడిజానికి పరాకాష్టగా చెప్పుకొనే ఉదంతం ఇది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. దిశ కుటుంబానికి జరిగిన అన్యాయానికి కంటతడి పెట్టని వారు లేరు. ఈ దారుణ ఘటనకు కారణమైన నలుగురిని బహిరంగంగా ఉరి తీయాలంటూ దేశం మొత్తం నినదిస్తున్న వేళ.. ఓ యువకుడు మాత్రం ఈ ఘటనను అశ్లీలంగా, అసభ్యకర దృష్టికోణంలోనే చూశాడు. ఫేస్ బుక్ లో అశ్లీలకర పోస్టింగులను చేసి, తనలోని పైశాచికత్వాన్ని చాటుకున్నాడు.

Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!

అతని పేరు చవాన్ శ్రీరామ్. వయస్సు 22 సంవత్సరాలు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ కు చెందిన యువకుడు. ఫేస్ బుక్ వేదికగా వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంపై అసభ్యకర కామెంట్లు, పోస్టింగులను సర్క్యులేట్ చేస్తున్నట్లు హైదరాబాద్ క్రైమ్ కంట్రోల్ సెల్ (సీసీఎస్) పోలీసులు గుర్తించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్నారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా అతణ్ని గుర్తించారు. అరెస్టు చేశారు.

Disha murder case: Chavan Sriram held for posting objectional comments on social media on Veterinary Doctor Dishas murder

ఈ విషయాన్ని సీసీఎస్ పోలీస్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ దిశపై జరిగిన సెక్సువల్ వయొలెన్స్, హత్యపై అసభ్యకరమైన కామెంట్లు, అశ్లీలకరమైన సందేశాలను పోస్ట్ చేయడంతో పాటు వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు కిందటి నెల 30వ తేదీన గుర్తించారు. అతని అసలు పేరు చవాన్ శ్రీరామ్ కాగా.. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో స్టాలిన్ శ్రీరామ్ గా పేరు మార్చుకున్నట్లు నిర్ధారించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించారు. అతణ్ని అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అతనిపై క్రైమ్ నంబర్ 1210/2019 కేసు నమోదు చేశారు.

English summary
The Hyderabad police have arrested one person for making objectional comments on Facebook over the Disha rape and murder case in Shadnagar. The accused Chavan Sriram (22) belongs to Fakeerabad in Navipet mandal of Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X