Disha Rape Murder: డాక్టర్ మరణంతో విషాదంలో మునిగిన గ్రామం.. స్థానికుల కంటతడి

హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడి, హత్య ఘటన దేశాన్ని కంటతడి పెట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దిశ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దిశతో అనుబంధాన్ని పెంచుకొన్న హైదరాబాద్‌కు సమీపంలోని ఓ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఇంతకు ఆ గ్రామానికి దిశకు ఉన్న సంబంధమేమిటంటే..

 కొల్లూరు గ్రామంలో డాక్టర్‌గా

కొల్లూరు గ్రామంలో డాక్టర్‌గా

రాష్ట్ర రాజధానికి సమీపంలోని కొల్లూరు గ్రామం దిశ మరణంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామంతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని గ్రామస్థులు, అధికారులు కంటతడి పెడుతున్నారు. తమ గ్రామానికి దిశ చేసిన సేవలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యతం అవుతున్నారు.

కాలినడకన ఉద్యోగానికి

కాలినడకన ఉద్యోగానికి

వెటర్నరీ విద్యను అభ్యసించిన దిశ పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు 50కిపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం కొల్లూరు గ్రామంలో ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో దిశ బస్సులోనే ప్రయాణించేదని, తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆమె నడకన వెటర్నరీ ఆస్పత్రికి చేరుకొనేది. కొన్ని సార్లు తమ వాహనంలో ఆమెను దింపేవారమని అధికారులు తెలిపారు.

గ్రామస్థుల కంటతడి

గ్రామస్థుల కంటతడి

కొల్లూరు గ్రామంలోని పశుశాలలో దిశ మెరుగైన సేవలు అందించారనే విషయాన్ని స్థానిక అధికారి గుర్తు చేసుకొన్నారు. కొన్నిసార్లు ఆమెను తమ వాహనంలోనే బస్సు స్టాండ్ వద్ద విడిచిపెట్టేవారమని, అక్కడ నుంచి టోల్ ప్లాజా వరకు చేరుకొని స్కూటీపై ఇంటికి చేరుకొనే వారనే విషయాన్ని మీడియాతో పంచుకొంటూ కంటతడి పెట్టారు.

గ్రామానికి మెరుగైన సేవలు

గ్రామానికి మెరుగైన సేవలు

2017 జనవరిలో కొల్లూరులోని వెటర్నరీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్‌గా చేరారని, ఆమె రైతులకు అండగా నిలిచారు. వేలాది జంతువులకు, పశువులకు సేవలు అందించారు అని చెబుతూ స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. శంషాబాద్‌కు సమీపంలో లైంగిక దాడికి గురై నలుగురు మృగాళ్ల చేతిలో సజీవం దహనం కావడం దేశవ్యాప్తంగా ప్రజలను విషాదంలోకి నెట్టిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+