రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్‌పై జేజమ్మ గుస్సా ...
హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై జేజమ్మ అరుణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని శివాలెత్తారు. అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్పిన కేసీఆర్ .. చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని డీకే అరుణ విమర్శించారు. ఆయన చెప్పేదోకటి.. చేసిది మరోకటి అని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చాకే పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదని గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని పక్కన కూర్చొబెట్టుకొని సుద్దులు చెప్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టులు సాధించింది ఉమ్మడి రాష్ట్రంలో తనేనని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీఎంకు హరతి పట్టావని తనను కేసీఆర్ ఆరోపణలు చేశాడని గుర్తుచేశారు. మరీ కొత్త గా కేసీఆర్‌కు రాయలసీమ ప్రేమ పుట్టుకొస్తుందని ప్రశ్నించారు. ఈ ప్రేమ, దయలో ఆంతర్యం ఏంటని అడిగారు. రాజకీయ స్వలాభమా కాదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌తో దోస్తి కోసమే కాదా అని కొశ్చన్ చేశారు. కేసీఆర్ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని .. ఆయనకు బుద్దిచెప్తారన్నారు జేజమ్మ.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications