Hyderabad: హైదరాబాద్ లో రూ.229 కోట్ల భారీ మోసం..
హైదరాబాద్ లో రోజుకో మోసం బయట పడుతోంది. డీబీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడిదారులను రూ.7000 కోట్లకు ముంచిన సంగతి మరిచిపోకుండానే.. మరో కుంభకోణం బయటపడింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కు సంబంధించి మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్, నెక్ బ్యాండ్స్ మార్కెటింగ్ చేస్తున్నామంటూ 17,500 మంది నుంచి రూ.229 కోట్లు వసూలు చేసిన గ్యాంగ్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
డీకేజెడ్ టెక్నాలజీస్ అనే కంపెనీ హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా కంపెనీ పెట్టింది. డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ ఎండీగా అష్ఫక్ రాహిల్, డైరెక్టర్‌గా అతని భార్య సయ్యద్ ఐషా నాజ్ ఉన్నారు.వీరు బోల్ట్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్, నెక్‌బ్యాండ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్‌లైన్ మార్కెంటింగ్ చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు యూట్యూబ్‌లో ప్రమోషన్స్ చేశారు. తమ సంస్థ అమెజాన్ ఈ కామర్స్‌తో కలిసి బోల్ట్ హెడ్‌ఫోన్స్, నెక్‌బ్యాండ్స్ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు.

బి2బి(బిసినెస్ టూ బిసినెస్), బి2సి(బిసినెస్ టూ కస్టమర్) బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. చాదర్ ఘాట్, టోలిచౌకిలో తమ స్టోర్స్ ఉన్నట్లు నమ్మబలికారు. అమెజాన్ ద్వారా ప్రతి రోజు 4,000 ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పుకున్నారు. రూ.5,000 అంతకు మించి డిపాజిట్స్ చేసి తమ పార్ట్‌నర్స్‌గా చేరాలని ఆఫర్ ఇచ్చారు. పెట్టుబడిపై 8 శాతం నుంచి 12శాతం వరకు వడ్డీ ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్‌లో ఈ కంపెనీ ప్రకటనలు చూసిన మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ పెట్టుబడి పెట్టాడు.
ఇందుకు డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ నిర్వాహకులు అష్ఫక్ రాహిల్, మహ్మద్ ఇక్బాల్, సయ్యద్ ఉమర్ అహ్మద్, మొయిజ్, నజీర్, బిలాల్ ను పలుమార్లు కలిశాడు. రూ.2.74 కోట్లు డిపాజిట్ చేశాడు. ఇలా పార్ట్‌నర్ షిప్ పేరుతో మొత్తం 17,500 మంది వద్ద డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ రూ.229 కోట్లు పెట్టుబడులు తీసుకుంది. ఆ తర్వాత ఆగస్ట్ లో బిచానా ఎత్తివేసంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కంపెనీల సోదాలు నిర్వహించారు. రూ.1.7 కోట్ల నగదు 564 గ్యారంటీ అగ్రిమెంట్ బాండ్స్, 13 ల్యాప్‌టాప్స్, వివిధ బ్యాంకులకు చెందిన చెక్‌బుక్స్, ఏజెంట్స్, క్లయింట్స్ పేర్లతో ఉన్న రికార్డులను పోలీసులు సీజ్ చేశారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications