హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘కరోనా’పై ఆందోళన వద్దు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైనా నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోహైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి తదితరు అధికారులు పాల్గొన్నారు. చైనానే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను కూడా స్క్రీనింగ్ చేయాలని, వైరస్ సోకిన రోగికి చికిత్స విషయంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనలు తీసుకోవాలని సమావేశంలో అధికారులకు మంత్రి ఈటల స్పష్టంచేశారు.

ఆందోళన వద్దు..

ఆందోళన వద్దు..


దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ వచ్చిందని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశీతంగా గమనిస్తున్నారు. వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మీడియాకు వివరించారు. ఇక నుంచి ఎయిర్‌పోర్టు నుంచి వచ్చేవారని ఒకటికి రెండుసార్లు టెస్ట్ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

120 మందికి పరీక్షలు

120 మందికి పరీక్షలు

చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్.. ధాటికి ఇప్పటికే 3 వేల మంది చనిపోయారు 85 వేల మంది వైరస్ సోకి చికత్స తీసుకుంటున్నారు. జనవరిలో హైదరాబాద్‌లో 120 మంది అనుమానితులను గుర్తించారు. వారికి పరీక్షలు చేయగా కోవిడ్-19 నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆదివారం దుబాయ్ నుంచి వచ్చిన నలుగురికి వైరస్ లక్షణాలు కనిపించాయి. వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

రెండు పాజిటివ్ కేసులు

రెండు పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ సోకితే రోగిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందజేయాలి. వారికి ట్రీట్‌మెంట్ చేసే వైద్యులు, సిబ్బంది కూడా ప్రత్యేకమైన మాస్క్ ధరించి పరీక్షిస్తారు. ఢిల్లీలో మరొకరికి పాజిటివ్ కేసు నమోదు కాగా.. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుతో ఆ సంఖ్య రెండు చేరింది. ఇదివరకే కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనా.. వారికి చికిత్స అందజేయడంతో వైరస్ నుంచి కోలుకున్నారు.

English summary
minister eetela rajendhar conduct meeting with health department officials on corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X