కేటీఆర్‌పై కామెంట్స్ చేయొద్దు, పరువునష్టం కేసు విచారణలో కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసును సిటి సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడొద్దని స్పష్టంచేసింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.

తప్పుడు ఆరోపణలు
డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి, తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఇప్పటికే కేటీఆర్ రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కేటీఆర్ కోరారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన కామెంట్లను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు కేటీఆర్.

పరువుకు భంగం
ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తన పరువు పోయేలా కానీ, తప్పుడు వ్యాఖ్యలు కానీ చేయకుండా రేవంత్ రెడ్డిని, అతని అనుచరులను నియంత్రించాలని పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఈ మేరకు కోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.

దురుద్దేశం
సంబంధం లేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా పేరును వాడుతున్నారని మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతోన్న వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అసత్యాలు ప్రచారం
రాజకీయ దురుద్దేశంతో అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తోన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తోన్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతోపాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తోన్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.
Recommended Video

యాక్షన్- రియాక్షన్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ అడిగారు. ఈ క్రమంలోనే పరువు నష్టం దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications