అబ్బే అదేం లేదు.. బీజేపీలో ఈటల చేరికపై.., కలుస్తానని మాత్రం చెప్పారు: కిషన్ రెడ్డి
మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు ఇతర పార్టీల్లో చేరతాడని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పేర్లు వినిపించాయి. ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలువడం.. తర్వాత ఒక్కో నేతను ఈటల కలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరతారని.. కేంద్రమంత్రితో సంప్రదింపులు జరిపారని లీకులు వచ్చాయి. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసలేం జరిగిందో పూస గుచ్చినట్టు వివరించారు.

అసలేం జరిగిందంటే..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటల రాజేందర్‌ను కలవలేదని చెప్పారు. ఫోన్‌లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటల రాజేందర్‌తో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్‌తో కలసి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఎప్పుడో ఒకప్పుడు మీట్..
ఈటల రాజేందర్‌ను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని కిషన్ రెడ్డి చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను.. తనను కూడా కలుస్తానని ఈటల తనతో అన్నారని వివరించారు. దీంతో బీజేపీలో చేరిక అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు కిషన్ రెడ్డి. కలుస్తా అంటే.. ఆహ్వానించానని పేర్కొన్నారు. ఒకవేళ హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు.

అవునా.. రేవంత్‌కు ఎలా తెలుసు
బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడని చెప్పారు. దానిపై తానేం మాట్లాడబోమని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి కచ్చితంగా సాయం చేస్తానని.. ఇందులో సందేహనికి తావులేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కొత్త పార్టీ పెడతారా..
భూముల స్కాం అని తెరపైకి తీసుకొచ్చి.. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తప్పించారు. దానిపై విచారణకు కమిటీ కూడా వేశారు. ఇంతలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనపై జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న.. రాజీనామా చేసేందుకు సిద్దం అని స్పష్టంచేశారు. ఇవాళ ప్రొఫైల్ పీక్ కూడా మార్చివేశారు. ఆయా పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలోకి వెళతారా.. లేదంటే పార్టీ పెడతారా అనే అంశంపై స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications