కదిలే బస్సులో లైంగికదాడి: కత్తితో బెదిరించి మరీ రేప్, రూ.7 వేలు తీసుకొని..
నిర్భయ.. ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆ కేసులో నిందితులకు ఉరి శిక్ష అమలయ్యింది. దాంతో యావత్ దేశం శాంతించింది. మరో అమ్మాయికి అలా జరగకూడదని భావించింది. అంతా అలా అనుకున్నారు. రోజుకో చోట.. అలాంటి.. అంతకన్నా ఘోరమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ తర్వాత అభయ.. తర్వాత చాలామంది అలానే జరిగింది. విశ్వనగరి భాగ్యనగరిలో ఇప్పుడు మరో ఘటన జరిగింది. అదీ కూడా బస్సులో రేప్ కావడం ఆందోళన కలిగిస్తోంది. మాట కలిపి.. ఓ డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు.

బస్సులో లైంగికదాడి
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. సొంతూరు వెళ్లేందుకు వచ్చిన మహిళను నమ్మకంగా బస్సెక్కించుకున్న డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళకు డ్రైవర్ చుక్కలు చూపించాడు. ఆమె హైదరాబాద్‌లో బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తుంది. ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా ఉంటున్నాడు. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 23న కూకట్‌పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కింది. అంతే అలా వెళ్లడమే పాపమైపోయింది.

అర్ధరాత్రి 12.30 గంటలకు
తనకు కేటాయించిన చివరి సీటులో నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటలు దాటిన తర్వాత బస్సును మరో డ్రైవర్ నడుపుతున్నారు. ఇంకేముంది అందులో ఉన్న మరో డ్రైవర్ రాజేశ్ నీచానికి పాల్పడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. హరాస్ చేయడంతో ఆమె ఎదిరించలేకపోయింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. అంతేకాదు బస్సు దిగే సమయంలో ఆమె వద్ద నుంచి రూ. 7 వేలను కూడా డ్రైవర్ దోచుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.
Recommended Video

మరీ మిగతా ప్రయాణికులు
బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం.. బస్సులో మిగతా ప్రయాణికులు లేరా అనే సందేహాం కలుగుతుంది. ఆమె ప్రతిఘటిస్తే వారు హెల్ప్ చేసేవారు కదా అని అంటున్నారు. అలా చేయకపోవడానికి కారణం ఏంటీ అని అడుగుతున్నారు. ఈ రోజుల్లో ఎదురిస్తేనే కదా.. మిగతా వారు భయపడేది అని అంటున్నారు. అలా కిమ్మనకుండా ఉంటే రెచ్చిపోరా అనే సందేహాం కలుగుతుంది. కానీ స్లీపర్ క్లాస్ బస్సులో కూడా డ్రైవర్లు ఇలా ఉంటే ఏం చేయాలి..? మంచి సుఖమైన ప్రయాణం కోసం వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా చేస్తారా అని జనం విస్తుపోతున్నారు.












Click it and Unblock the Notifications