చచ్చింది గొర్రె..! పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!!

హైదరాబాద్: ఫుల్లుగా పీకల దాకా తాగి పోలీసులు చెకింగ్ కోసం ఆపితే "పోలీస్" అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది. పోలీసులు నిర్వహించే ఆల్కహాల్ టెస్టుకు పోలీసులు కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇటీవలి కాలంలో పోలీసులు పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నట్టు, అడిగితే పోలీసులమని చెప్పి తప్పించుకుంటున్న కేసులు అదికంగా పోలీసు ఉన్నతాదికారుల దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను విధులు ముగించుకుని వెళ్లిపోతున్న పోలీసులకు కూడా నిర్వహించాలని నిర్నయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ఏ ప్రదేశంలో పోలీసులు తారసపడ్డా సాధారణ ప్రజానికానికి నిర్వహించినట్టే టెస్టులు నిర్వహించాలని పోలీసు ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Drunk and Drive Tests For Police too..!!

విధి నిర్వహణలో ఉండి మద్యం తాగే పోలీసులు ఉంటారనే విషయం తెలిసిందే. దీనితో పోలీసులు మద్యంలో మత్తు ప్రమాదాలు గురవుతుండడంతో వాటిని అరికట్టడానికి రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ఈ నిర్ణయం తీసుకున్నారు .పోలీసులకు ప్రమాదాల బారినుండి తప్పించాలనే ఉద్దేశంతో మరిన్ని చర్యలు రాచకొండ కమిషనరేట్ తీసుకోనుంది. ఇక నుంచి ఉదయం డ్యూటి ఎక్కిన తర్వాత రాత్రి డ్యూటి అయిపోయినా కూడా పైపులు పెట్టి ఏమైనా మందు తాగారా అని చెక్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డ్యూటీలో ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్డు ప్రమాదాలకు గురై గాయాపాలవుతున్నారని రాచకండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు డ్యూటికి వచ్చే పెట్రోలింగ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ డ్రైవర్లలతోపాటు డ్యూటిలో ఉండే ఇన్చార్జులకు చేస్తున్నారు. అలాగే రాత్రి డ్యూటి అయిపోగానే ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఇంటికి పంపుతున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+