Hyderabad: హైదరాబాద్‍లో భారీ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు..!
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మైత్రివనం, ఎర్రగడ్డ, మూసాపేట మెయిన్ రోడ్ పై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో చాలా చోట్ల భారీగా ట్రాఫి జామ్ ఏర్పడింది. అమీర్ పేట వద్ద ఒక పక్క నుంచి మాత్రమే వాహనాలను పంపిస్తున్నారు. మరో పక్క వర్షపు నీరు భారీగా చేరడంతో నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. భరత్ నగర్ బ్రిడ్జి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలను అధికారులు సూచిస్తున్నారు. యూసఫ్ గూడ, కృష్ణా నగర్ లో కూడా కాలనీలు జలమయమయ్యాయి. అటు బాల్కంపేట ఫ్లైఓవర్ వద్ద కూడా భారీగా వరద నీరు నిలిచింది. వరద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది బయటకు పంపుతున్నారు. వర్షపు నీరు ఆగిన చోట జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పర్యటిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు. అటు కుత్భల్లాపూర్ భారీ వర్షానికి కాలనీలు చెరువులను తలపించాయి. రేపు కూడా భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు.

మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం పడగా.. కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 12.5 సెంటీమీటర్లు, బోరబండ లో 12.5 సెంటీమీటర్లు, జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్లు, షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు, బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు, గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు, మలక్పేట్ లో 9.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది.
ఫలక్నుమాలో 9.2 సెంటీమీటర్లు, కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు, సరూర్నగర్ లో 7.9 సెంటీమీటర్లు, ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు, మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేత మూసీలోకి 442 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications