Heart Attack: గుండెపోటుతో ఎస్సై మృతి.. అస్సలు ఏం జరుగుతోంది..!
ప్రస్తుతం ఎక్కడా విన్న గుండెపోటు వార్తలే వస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, జిమ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పుకూలిపోతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతని చనిపోయాడు.
ఆ తర్వాత ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలి చనిపోయాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్దీ ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లి డ్యాన్స్ చేస్తూ వేదికపైన కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మృతి చెందాడు.

తాజాగా హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎస్సై గుండె పోటుతో మృతి చెందారు. గండి మైసమ్మకు చెందిన ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి గురువారం రాత్రి 9 గంటలకు గుండె నొప్పి వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటు వయస్సు, చేసే పనితో సంబంధం లేకుండా వస్తోంది. రెండు రోజుల క్రితం 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ అదే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో చనిపోయినట్లు కుంటుంబసభ్యులు వెల్లడించారు. ఇప్పపటికైనా అందురు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications